సీఎంలా అందరికీ న్యాయం చేశా -కులాలు, మతాలు, పార్టీలు చూడలేదు వీడ్కోలు సభలో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి

కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమంటూ సాగుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలా తానూ దర్శి సబ్ డివిజన్లో పోలీసు విధులు నిర్వర్తించానని డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి అన్నారు. స్థానిక పీజీఎన్ సమావేశం హాలులో బదిలీపై వెళ్లిన నారాయణస్వామిరెడ్డికి దర్శి పోలీసులు వీడ్కోలు సభ ను దర్శి సిఐ జె. రామకోటయ్య అధ్యక్షతన నిర్వహించారు. డివిజన్ పరి ధిలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ఆయన్ను ఘనంగా సన్మానిం చారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి.ఎస్.పి నారాయణస్వామిరెడ్డి మాట్లాడుతూ…. విధి నిర్వహణలో నిబద్ధతగా పని చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. తప్పులు జరిగినప్పుడు అధికారు లపై కోప్పడి ఉంటే తప్పుగా అనుకోవద్దని అన్నారు. తనకు ఎవరిపైనా ప్రత్యేకిం చి కోపం ఉండదన్నారు. అనంతరం అనేకమంది ప్రముఖులు జర్నలిస్టులు ఘనంగా డి.ఎస్.పి నారాయణస్వామి రెడ్డిని సన్మానించారు కార్యక్రమంలో సీఐ జె. రామకోటయ్య, ఎస్ఐ రామ కృష్ణ, సంఘ సేవకుడు జీవీ రత్నం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *