తాళ్లూరు వికే ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ తారక్నాథ్్ప జిల్లా మాల మహానాడు సంఘ అధ్యక్షుడు దార అంజయ్య నిరాధార ఆరోపణలు తగవని కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం అన్నారు. స్థానిక వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మంగళవారం సమావేశమైన అధ్యాపకులు కళాశాల అభివృద్ధికి ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో అధ్యాపకులు అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నామని అన్నారు. నాడు- నేడు పనులు కూడ చాలా చక్కగా జరుగుతున్నాయని అన్నారు. దాతల సహకారంతో కళాశాలలో చేసిన అభివృద్ధి అలాగే ఉందని. ప్రభుత్వం కూడ నాడు – నేడులో అభివృద్ధి చేయటంతో కళాశాల మరింత అభివృద్ధి చెందటం కొందరికి ఇష్టం లేక కావాలనే స్వార్ధ ప్రయోజనాలతో ఇలాంటి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా గవర్నమెంటు జూనియర్ లెక్చరర్స్ అసోషియేషన్ జాయింట్ సెక్రటరీ యు. పాండురంగరాజు, సివిక్స్, ఎలక్ట్రానిక్స్ అధ్యాపకులు గురవయ్య. ఎల్. ఎల్ నరసింహారావు, అధ్యాపకేతర సిబ్బంది పి అనిన్ పురోషోత్తం. షేక్ మాలిన్, బి. వెంకటేశ్వర్లు, కె. శ్రీనివాసరావు, సీహెచ్ జయపాల్ రావు, సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్పై నిరాధార ఆరోపణలు తగవు
09
May