వైభవంగా అంకాలమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు

ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామంలో అష్ట పద్మాల అంకమ్మ తల్లి వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పొంగళ్ళు పొంగించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఆలయ పూజారి నాగుమల్లి రమణయ్య భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి సంవత్సరం మే నెలలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ, ఈ తిరుణాలకు చుట్టుపక్కల గ్రామాలైన భీమవరం , పూరి మెట్ల, ఉమామహేశ్వరపురం, మారెళ్ళ,తమలూరు. నాయుడుపాలెం. బొప్పూడి వారి పాలెం. మక్కినేని వారి పాలెం, జమ్మలమడక, రమణారెడ్డి పాలెం, అయోధ్య నగర్, వేముల, వేముల బండ, కొమ్మవరం, తదితర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ప్రకాశం జిల్లా, పలనాడు జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా ల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. భక్తుల కొంగుబంగారంగా పిలవబడే అంకాలమ్మ తల్లి నమ్మిన దేవత కోరిన కోరికలు తీర్చడంలో ప్రత్యేక స్థానం ఉంది. పెద్ద మొత్తంలో భక్తులు పాల్గొంటారు పిల్లలు లేని వారికి ఆలయంలో ఏర్పాటు చేసిన అంకాలమ్మ తల్లి ఉయ్యాల ఊపుతూ పాటలు పాడుతూ ఉంటే పిల్లలు కలుగుతారని బలమైన నమ్మకం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుణాల సందర్భంగా మారెళ్ళ వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు . తిరుణాల సందర్భంగా నాలుగు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేశారు. తిరుణాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శి డిఎస్పి అశోక్ వర్ధన్ రెడ్డి సారథ్యంలో దర్శి సీఐ జె రామకోటయ్య ఆధ్వర్యంలో ముళ్ళమూరు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *