రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ముండ్లమూరు మండలంలోని రెడ్డి నగర వద్ద గల మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బసవాపురం గ్రామానికి చెందిన కిలారి చిన్న కోటేశ్వరరావు( 55) అక్కడికక్కడ మృతి చెందాడు. చిన్న కోటేశ్వరరావు సొంత పనులు నిమిత్తం ఉల్లగల్లు వెళ్లి పనులు ముగించుకొని తిరిగి ఇంటికి వెళుతుండగా మార్గమధ్యంలో రెడ్డి నగర్ వద్ద దర్శి వైపు నుండి అద్దంకి వైపు వెళుతున్న కారు ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కిలారి చిన్న కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐఎల్ సంపత్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్ సంపత్ కుమార్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *