దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి పేదలకు అం దించిన సేవలు అమూల్యమైనవని ఆయన సతీమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే టీజే
ఆర్ సుధాకర్ బాబు, కుమారుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి కొనియాడారు. సుబ్బారెడ్డి వర్ధంతి సందర్భం గా గురువారం చీమకుర్తిలోని బూచేపల్లి కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో వారు ముఖ్య అతి థులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. పేదల విషయంలో బూచేపల్లి సుబ్బారెడ్డి మానవతా దృక్పథంతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేసి, అన్నదానం నిర్వ హించారు. తొలుత బూచేపల్లి సుబ్బారెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ సీపీ నాయకులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ యద్దనపూడి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ చల్లా అంకులు, జెడ్పీటీసీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీ నర్ క్రిష్టిపాటి శేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ రూరల్ మండల కన్వీనర్ పమిడి వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ బాపతు వెంకటరెడ్డి,నలమల మాణిక్యం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గోగినేని వెంకటేశ్వర్లు, పట్టణంలోని 20 వార్డులకు చెందిన కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, స్థానిక నాయ కులు పాల్గొన్నారు.


