వేసవి సీజన్లో లభించే తాటి ముంజలకు గిరాకీ బాగుంటో0ది. మామిడి పండ్లు తర్వాత వేసవిలో అందరూ ఇష్టపడేవి తాటి ముంజ లు, ఈ తాటి ముంజల వలన గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమంది మహిళలు పురుషులు కు జీవనోపాధి లభిస్తోంది. ముఖ్యంగా తాటి ముంజలను విక్రయించేందుకు గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వస్తుంటారు. మండలంలో పక్క గ్రామాలైన నాయుడుపాలెం ,తమ్మలూరు ,ఉమామహేశ్వరపురం, పూరిమెట్ల, గ్రామాల నుండి తాటికాయలు తీసుకువచ్చి తాటి ముంజలు తీసి విక్రయిస్తుంటారు. గీత కార్మికులు తమ జీవ నాన్ని ఎండాకాలంలో తాటి ముంజలు అమ్ముతూ సాగిస్తుంటారు. సాయంకాలం సమయంలో తాటి చెట్ల నుండి తాటికాయలు గెలలు గెలలుగా కోస్తారు. వేకువ జామున ఆ కాయలను కోసి లోపల ఉన్న తాటి ముంజలను తీసి చిన్న గంపల్లో నింపుకొని వీధి వీధి తిరుగుతూ అమ్ముకోవడం కనిపిస్తోంది. ఒక కాయను పది రూపాయల నుండి 15 రూపాయల వరకు అమ్ముతూ ఉంటారు. ఒక ముంజ ఐదు రూపాయల నుండి ఆరు రూపాయల వరకు ధర పలుకుతోంది. ఒక డజను ముంజలు 45 రూపాయల నుండి 60 రూపాయల వరకు విక్రయిస్తుంటారు. తాటి ముంజలు అంటే చిన్నారుల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. తాటి ముంజలలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఉష్ణ తాపాన్ని తగ్గించి శరీర వేడిని క్రమ పరుస్తాయి. తాటి ముంజల ధరలు కూడా పెరిగి సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతున్నాయి.
