ముండ్లమూరు మండలంలోని కొమ్మవరం గ్రామానికి చెందిన వైసిపి పార్టీ కార్యకర్త మేకల సుబ్బారెడ్డి వెంకట రాధా దంపతుల కుమార్తె మౌనిక వివాహ కార్యక్రమానికి దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శనివారం హాజరైనారు. మేకల సుబ్బారెడ్డి వెంకట రాధా కుమార్తె మౌనిక వివాహ కార్యక్రమానికి హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ మండల కన్వీనర్ సూది దేవర అంజయ్య, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు మేకల వెంకటేశ్వర రెడ్డి, వైస్ ఎంపీపీ బంక రమణమ్మ నాగిరెడ్డి, పసుపుగల్లు మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాస్ రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షులు గాదే నాసర్ రెడ్డి, ఆదర్శ పాఠశాల చైర్మన్ బిజ్జం సుబ్బారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే
13
May