ముండ్లమూరు మండలంలోని ఈదర గ్రామ సర్పంచ్ వంగల పద్మావతి శ్రీనివాస్ రెడ్డిని దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శనివారం పరామర్శించారు. శ్రీనివాస్ రెడ్డి ఇటీవల ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద ఉంటున్నాడు. సమాచారం తెలుసుకున్న డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈదరవెల్లి శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. యోగక్షేమాల గురించి ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసిపి మండల కన్వీనర్ సూది దేవర అంజయ్య, మాజీ సర్పంచ్ చింత శ్రీనివాస్ రెడ్డి, ఆదర్శ పాఠశాల చైర్మన్ బిజ్జం సుబ్బారెడ్డి, అబ్బనీ అంజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాసరెడ్డిని పరామర్శించిన బూచేపల్లి
13
May