కోర్టుల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృ థా చేసుకోవడం కంటే రాజీ చేసుకోవడం రాజ మార్గమని సీనియర్ సివిల్ జడ్జి జీఎల్వీ ప్రసాద్ అన్నారు. స్థానిక సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో శని వారం నేషనల్ లోక్ అదాలత్ జరిగింది. లోకదాల చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి జీఎల్వీ ప్రసాద్ …మాట్లాడుతూ వివాదాలకు వెళ్లి కక్షలు కార్పణ్యాలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరిగితే డబ్బు నష్ట పోతారని చెప్పారు. మంచి, మానవ త్వంతో ఆలోచించి ఇరువురు రాజీ చేసుకుంటే ఇద్దరూ గెలిచినట్లేనని స్పష్టం చేశారు. జూనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి మాట్లాడుతూ…
భూమిలో పండిస్తేనే మనం తింటామని, రైతు, రాజ బాగుంటుందని చెప్పారు. అలాంటి భూమిలో వివాదాలు పెట్టుకుని పంటలు వేసుకోకుండా స్టేలు తెచ్చుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. రైతు పండించే పంటను ఆ సంవత్సరం కోల్పోతే మరుసటి సంవత్సరం ఆ భర్తీని తీర్చలేరని పేర్కొన్నారు. రాజీ చేసుకుంటే అంద రికీ మంచిదన్నారు. డీఎస్పీ అశోకవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో కక్షలకు వెళ్లి వివాదాలు పెంచుకుంటే కుటుంబాలు వీధుల పాలవు తాయని హెచ్చరించారు. రాజీ చేసుకుంటే ఎవరికీ ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. లోక్ అదా లతో 80 క్రిమినల్ కేసులు, 14 సివిల్ కేసులు, రూ. 80 లక్షల నగదు రాజీ చేశారు. కార్యక్రమం లో సంఘ సేవకులు జీవీ రత్నం, న్యాయవాదులు సురేష్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
