తాళ్లూరు మండలంలోని దోసకాయలపాడు పంచాయితీ పరిధిలోని తోట వెంగన్నపాలెంలో ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త చెల్లు మోహనరావు కుటుంబానికి ఆదివారం జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్చార్జి నాదేండ్ల మనోహార్ రూ. 5లక్షల చెక్కును అందజేసారు. మృతుడు మోహనరావు భార్య ధనలక్ష్మి, పిల్లలు నిఖిల, నిఖిల్లలను పరామర్శించారు. ఈ సందర్భంగా నాదేండ్ల మనోహర్ మాట్లాడుతూ ఒక్క ఎమ్మెల్యే కూడ లేని జనసేన పార్టీ పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పిస్తుందని అన్నారు. ప్రభుత్వం భీమా పథకంలో పలు లోపాలతో కుటుంబాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కనీసం పరామర్శించిన వారు కూడ లేరని అన్నారు. సీఎం బటన్ నొక్కుతూ ప్రజలను పట్టించుకోవటం లేదని చెప్పారు. మోహనరావు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, ఆయన పిల్లల చదువులపై ప్రత్యేక శ్రర తీసుకుంటుందని అన్నారు. ముందుగా గుంటి గంగా భవాని ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు “నిర్వహించారు.
బహిర్గతమైన వర్గ పోరు……..
మృతుని కుటుంబానికి చెక్కు అందజేయ్యటానికి తోట వెంగన్నపాలెం వచ్చిన నాదేండ్ల మనోహార్ వద్ద జనసేన వర్గ పోరు మరో మారు బయట పడినది. దర్శి నియోజక వర్గ ఇన్చార్జి బోటుకు రమేష్, జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజుల వర్గీయులు ఎవరికి వారు తమ నాయకుని నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తారు. దీంతో నాదేండ్ల మనోహర్ విస్తుపోయారు. ఆయా కార్యక్రమాలలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, రాష్ట్ర
అధికార ప్రతినిధి రాయపాటి అరుణ. దర్శి నియోజక వర్గ ఇన్చార్జి బొటుకు రమేష్, లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు గిద్దలూరు నియోజక వర్గ ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.
