మార్కాపురం డివిజన్ లోని, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా దారిద్రరేఖకు దిగున ఉన్న పేదలకు, సన్న కారు రైతు,రైతుకూలీలకు నిత్యవసర సరుకులలో భాగంగా బియ్యం, కందిపప్పు, నూనె, గోధుమపిండి మొదలైన నిత్యవసర సరుకులు ప్రతినెల క్రమంగా అందిస్తుంటే కొంతమంది రేషన్ షాప్ డీలర్లు పేదలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని యదేచ్చగా ప్రైవేటు మార్కెట్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిని సంబంధించిన అధికారులు మండల స్థాయి అధికారులు నెలసరి మాముళ్లకు తీసుకుంటూ అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారు. రేషన్ షాపు లైసెన్సులు ఒకరి పేరు మీద ఉంటే షాపు నడిపే వ్యక్తి మరొక వ్యక్తి అవ్వటం ఇక్కడ ప్రధానమైన విశేషం కారణం.. రాజకీయ నాయకులకు, వారి బంధువులకు మాముళ్ళు ఇస్తూ పబ్బం గడుపుతున్నారు
కొన్ని మండలాల్లో డీలర్లు ప్రజలు అడిగిన సరిగ్గా ఏమి సరుకులు ఇవ్వటం లేదు. తూకాల్లో సైతం మోసం చేస్తూ ఐదు కేజీలు ఇవ్వాల్సిన కాడ మూడు కేజీలు ఇస్తూ మిగతా సరుకును ప్రైవేటు మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు .