దొనకొండ మండలంలోని కొచ్చెర్లకోటలో నూతనం గా నిర్మించిన శివపార్వతుల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్ర మాన్ని రెండు రోజుల నుంచి గ్రామస్తులు భక్తి శ్రద్ధ లతో పూజా కార్యక్రమాలు చేపట్టి విగ్రహాలను ప్రతి ఎంచారు. వేద పండితులు వేద మంత్రాలతో పూజా కార్యక్రమం నిర్వహించి శివపార్వతుల విగ్రహాలకు పూజలు చేసి ప్రతిష్ఠించారు. చుట్టు పక్కల గ్రామాలైన బసిరెడ్డిపల్లి, నారపురెడ్డిపల్లి, సిద్ధాయపాలెం, పుల్లాయపల్లి, కట్టకిందపల్లి గ్రామస్తులు అధిక సం ఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ధ్వజ స్తంభ ప్రతిష్ఠలో
ముఖ్య అతిధులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి
ధ్వజస్తంభ ప్రతిష్ఠలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ముందుగా గ్రామస్తులు వారికి పూలమాలలతో ఘన స్వాగతం పలి కారు. బసిరెడ్డిపల్లి గ్రామంలో హనుమాన్ జయంతిలో పాల్గొన్నారు. వారి వెంట మండల కన్వీనర్ కాకర్ల క్రిష్ణారెడ్డి, గొంగటి పోలిరెడ్డి, పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


