పేదలకు అండగా బూచేపల్లి కుటుంబంఉంటుందని …
దివంగత దర్శి శాసన సభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి ఉన్నప్పుడే హామీ ఇచ్చారని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పేర్కొన్నారు. కురిచేడు మండలంలోని ఆవులమందలోని చర్చి ప్రారంభోత్సవానికి దర్శి మాజీ శాసన సభ్యులు బూచేపల్లి శివప్రసాదరెడ్డితో కలిసి ఆది వారం ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. వారికి గ్రామస్తులు ఘనం గా స్వాగతం పలికారు. మహిళలు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మను ఆప్యాయంగా పలకరించారు. ఆమె చేతి స్పర్శ కోసం బారులుతీరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ దేవుని కీర్తనలు ఆల పించారు. అనంతరం మాట్లాడుతూ …బూచేపల్లి వెంకాయమ్మ ,సుబ్బారెడ్డి
(బి. వి .ఎస్. ఆర్) చారిటబుల్ ట్రస్టు పేదల కోసం ఏర్పాటు చేశామని, పేదలు అడిగిం
దే తడవుగా …తమ కుటుంబం సహకారం అందిస్తుందన్నారు. నియోజకవర్గంలో తమ కుటుం బాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని దర్శి మాజీ శాసన సభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. పేదలకు సేవ చేస్తే ఆ భగవంతునికి సేవ చేసినట్లు తమ కుటుంబం భావించి దివంగత మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి సేవలు చేసేవారన్నారు. జెడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి, నాయకులు నారు శ్రీనివాసరెడ్డి, ఊట్ల వెంకటేశ్వర్లు, ఎన్వీ నాగిరెడ్డి, పాతకోట వెంకట రెడ్డి, నుసుం ప్రతాపరెడ్డి, గొట్టిపాటి బాలకోటయ్య, పల్లె సుందరరావు, పల్లె డేవిడ్, పల్లె వెంకటయ్య, పల్లె ఏలియా, నాగిపోగు ఆశీర్వాదం, సాతులూరి ఆనందరావు, నాగిపోగుదా వీదు, గండి కోటేశు, పల్లె దానియేలు తదితరులు పాల్గొన్నారు.




