హర్యానాలో కొత్త మద్యం పాలసీ!

ఆఫీస్‌లో పని ఒత్తిడిగా అనిపిస్తే.. చాల మంది ఉద్యోగులు క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగుతుంటారు. మరికొంతమంది మాత్రం సాయంత్రం ఆఫీస్‌ అయ్యాక..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

పబ్‌, బార్‌కో వెళ్లి రిలాక్స్‌ అవుతుంటారు. ఇకపై ఆఫీస్‌ అయ్యేదాకా ఎదురుచూడాల్సిన అవసరంలేదు. క్యాంటీన్‌కు వెళ్లి టీ/కాఫీ తాగినట్లు.. ఆ రాష్ట్రంలో క్యాంటీన్‌కు వెళ్లి బీర్‌ తాగొచ్చు. ఎక్కడంటారా? హర్యానా ప్రభుత్వం ఉద్యోగులు ఆఫీస్‌లోనే మద్యం సేవించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఇది కేవలం కార్పొరేట్ ఉద్యోగులకు మాత్రమేనని తెలిపింది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి రాష్ట్రంలో నూతన మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా పెద్ద కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆఫీస్‌ పరిసరాల్లో ఆల్కహాల్‌ శాతం తక్కువ ఉన్న బీర్‌, వైన్‌ వంటి వాటిని తాగేందుకు అనుమతించింది..

జూన్‌ 12 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలిపింది. మే 9 తేదీన జరిగిన సమావేశంలో మంత్రివర్గం దీనికి ఆమోదం తెలిపింది. ఐదువేలు మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, కనీసం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన సంస్థలు తమ ఉద్యోగులకు మద్యం సరఫరా చేయొచ్చు. ఇందుకోసం కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక లైసెన్స్‌ (L-10F)ను జారీ చేస్తుంది. లైసెన్స్‌ కోసం ఆయా సంస్థలు రూ. 10 లక్షలు వార్షిక రుసుము చెల్లించాలి. దాంతోపాటు మరో రూ. 3 లక్షలు సెక్యూరిటీ మొత్తంగా చెల్లించాలి. అలానే, సంస్థలో క్యాంటీన్‌ కోసం రెండు వేల చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. నిబంధనల ప్రకారం లైసెన్స్‌ పొందిన సంస్థల వద్ద ఎలాంటి రద్దీ ఉండకూడదు. కలెక్టర్‌, ఎక్సైజ్‌, ఐటీ కమీషనర్ల అనుమతితో లైసెన్స్‌ మంజూరు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *