యూకే పర్యటనలో భాగంగా ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లండన్‌లోని అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పించారు. హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 125 భారీ విగ్రహం ను పోలిన నమూనా విగ్రహాన్ని మంత్రి మ్యూజియంకు బహూకరించారు.
డా. అంబేద్కర్ లండన్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న సమయంలో నివసించిన ఇంటిని ఆ తరువాత అంబేద్కర్ మ్యూజియంగా మార్చారు. అంబేద్కర్ నివసించిన గదితో సహా మొత్తం భవనాన్ని మంత్రి కేటీఆర్ ఆసక్తిగా వీక్షించారు. చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు.