రెండు సచివాలయాలలో గ్రామ కార్యదర్శులు లేక ఇబ్బందులు

తాళ్లూరు మండలంలోని రెండు సచివాలయాలలో గ్రామ కార్యదర్శులు విధులలో లేక పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రజలకు సేవలను వేగంగా పారదర్శకంగా అందించేందుకు సచివాయ వ్యవస్థను ఏర్పాటు చేసి మెరుగైన పాలన అందింస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నది. అయితే పలు చోట్ల ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలు, స్వార్ధ ప్రయోజనాలతో పాలన అస్థవ్యస్థంగా ఉంటుంది. శివరామపురం గ్రామకార్యదర్శి ఎప్రియల్ 22న పద్మను రామభద్రా పురం పంచాయితీకి బదిలీ చేసి ఆస్థానంలో నాగంబొట్లపాలెం గ్రామకార్యదర్శి పురం నరేంద్రకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ అప్పటి ఇన్చార్జి ఎంపీడీఓ వి. శ్రీనివాసరావు ఉత్తర్వులు ఇచ్చారు. తర్వాత వచ్చిన ఎంపీడీఓ వై శ్రీనివాసరావు ఆ ఉత్తర్వులను అమలు చేయక పోవటంతో గత 23 రోజులుగా ఆ గ్రామకార్యదర్శి లేక పోవటంతో పాలన గాడి తప్పింది. అదే విధంగా తాళ్లూరు -2 సచివాలయ కార్యదర్శి చిరంజీవి ఎప్రియల్ 26 నుండి సెలవుపై వెళ్లారు. దీంతో అక్కడ ఎవరికి ఇన్చార్జిగా నియమించిన దాఖలాలు లేవు. గత 20 రోజులుగా ఆ గ్రామానికి కార్యదర్శి లేరు. ఆయా గ్రామాలకు కార్యదర్శుల నియామకంలో అధికారులు మీన మేషాలు లెక్కిస్తున్నారని. ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామకార్యదర్శులను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *