పేదలందరికి నివాసాలు అందించటమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని తాళ్లూరు – 2 జెసీఎస్ కన్వినర్ కొర్రపాటి విష్ణు అన్నారు. కొర్రపాటి వారి పాలెంలో స్వంత స్థలాలలో నివాసాలు నిర్మించుకునేందుకు పులి రేఖ, సంగం సునీత, కొమ్మాల పాటి అరుణ, పులి మరియమ్మలను నివాసాలు మంజూరు కాగా వారి మంజూరు పత్రాలను సచివాలయ ఇంజనీంగ్ అసిస్టెంట్ బాపి రెడ్డి అందించారు. తాళ్లూరు-2 జెసీఎస్ కన్వినర్ మాట్లాడుతూ స్వంత స్థలాలలో నివాసాలు నిర్మించుకునేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్, స్థానిక ప్రజా ప్రతినిథులు కృషితో అనుమతి మంజూరు అయ్యాయని చెప్పారు. త్వరగా నివాసాలు నిర్మించుకోవాలని బిల్లులు సకాలంలో అందిస్తున్నట్లు చెప్పారు.
గృహాలు త్వరగా నిర్మించుకోవాలి లబ్ధిదారులకు స్వంత స్థలాలో నివాసాల మంజూరు పత్రాలు అందజేత
15
May