డబ్బులిస్తేనే పొలాన్ని ఆన్లైన్ చేస్తామని కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు గ్రామానికి చెందిన పం దుగుల నర్సిరెడ్డి తహసీల్దార్ నయాం అహ్మద్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్పందన కార్యక్ర మానికి వచ్చి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 148, 276లో తనకి ఎకరా 58 సెంట్లు భూమి ఉండగా దాన్ని ఆన్లైన్ చేయించుకునేందుకు రెవెన్యూ సిబ్బం దిని కలిస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
వెంటనే స్పందించిన తహసీల్దార్ విచారించి న్యాయం చేస్తానని రైతుకు భరోసా ఇచ్చారు.
డబ్బులిస్తేనే ఆన్లైన్ చేస్తామంటున్నారు.. ముండ్లమూరు తహసిల్దార్ కు ఆవేదన వ్యక్తం చేసిన రైతు నర్సిరెడ్డి
16
May