పరిసరాల పరిశుభ్రత పాటించి దోమల నివారణకు అందరూ సహకరిస్తే డెంగ్యూ నివారణ చేయవచ్చని తూర్పు గంగవరం పీహెచ్సీ వైద్యాధికారి బి. రత్నం అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మంగళవారం అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి బి. రత్నం మాట్లాడుతూ … డెంగ్యూ నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు ఉన్నట్లు చెప్పారు. అనవసరంగా ఆందోళన చెందిన లక్షలలో ఖర్చు పెట్టుకోవద్దని చెప్పారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్లేట్ లెట్స్ కౌంట్ పరికరాలు కూడ అందుబాటులోనికి వచ్చాయని చెప్పారు. దోమల వలన అనేక వ్యాధులు వస్తాయని కాబట్టి దోమల నివారణకు ప్రజల చేయూత ఎంతో అవసమనిచెప్పారు. దోమలు మురుగు నీటి ఆవాస ప్రాంతాలలో ఎక్కువగా గుడ్లు పెడతాయని ఆ ప్రాంతాలు లేకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ఒక వేళ దోమలు అధికంగా ఉంటే దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు కూడ తీసుకోవాలని చెప్పారు. వైద్యశాఖ ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డేగా నిర్వహిస్తూ పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వైద్యురాలు మౌనిక. హెచ్ఓ వెంకటేశ్వర్లు, పీహెచ్ఎన్ మస్తానమ్మ, హెచ్పీ సుశీల, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
