తాళ్లూరు మండలం కొత్తపాలెం మరియు మాధవరం గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు ప్రముఖ పెర్టిలైజర్ కంపెనీ పి పి ఎల్ ప్రతినిధులు రైతు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వేసవికాలంలో పండించే పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిపిఎల్ కంపెనీ లభించే ఉత్పత్తుల గురించి తెలియజేశారు, రైతులకు సలహాలు సూచనల కొరకు జై కిసాన్ యాప్ ని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించే విధానాన్ని తెలిపారు, మట్టి నమూనా పరీక్షను ఆవశ్యకతను వివరించారు ఈ సమావేశం రైతులకు ఎంతో ఉపయోగకరమైనది కంపెనీ ప్రతినిధులను రైతుల అభినందించారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఆఫీసర్ పి. ప్రభాకర్ , జే ఏ లక్ష్మీదేవి, విలేజ్ అగ్రికల్ అసిస్టెంట్ సుధీర్ కుమార్, జెకెఎస్ ప్రసాద్, డి బి టి ఎస్ వెంకట్రావు, గ్రామ నాయకుడు నుసుము చిన్న ఆంజనేయ రెడ్డి రెండు గ్రామాల్లోని రైతులు తదితరులు పాల్గొన్నారు.
