ప్రజాశక్తి ఒంగోలు బ్రాంచి మేనేజర్ ఎంఎల్వి. ప్రసాదరావు అంజమ్మల కుమారై రజిత, మనోజకుమార్ ల వివాహ రిసెప్షన్ వేడుకలు ప్రకాశం జిల్లా, ముండ్లమూరు మండలం, వేంపాడు గ్రామంలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ప్రకాశం జడ్పి చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే లునారపు శెట్టి పాపారావు, దామచర్ల జనార్ధన్, ప్రముఖ వ్యాపారవేత్త సుధీర్ కుమార్, ప్రజాశక్తి ఎడిటర్ బి. తులసీదాస్, సిజిఎం అచ్యుతరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు వైవి, జాలా అంజయ్య, వై. సిద్ధయ్య, జిల్లా కార్యదర్శి హనీప్ తదితరులు పాల్గొని నూతనవధూవరులను ఆశీర్వదించారు.
