దర్శి నియోజక వర్గంలో గురువారం సాయంత్రం గాలి వాన భీవత్సం సృష్టించింది.
ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఉక్కపోత దెబ్బకు ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఇంత లోనే భయంకరమైన గాలి వాన భీవత్సము తో దర్శి, కురిచేడు ప్రధాన రహదారిలో చెట్లు నెల కొరిగాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడినది.
ట్రాఫిక్ క్లియర్….కురిచేడు మండలం బోధనంపాడు గ్రామం లో ఈదురు గాలులకు దర్శి వినుకొండ మెయిన్ రోడ్డు పై పడిన భారీ వృక్షాలు, నిలిచిన ట్రాఫిక్ ను R&B DE కృష్ణ, JE మంజూష, SI దేవకుమార్ పర్యవేక్షణ లో క్లియర్ చేసారు.




