దర్శి గ్రంథాలయం లో వేసవి శిక్షణా తరగతులు దర్శి లోని గ్రంథాలయం లో వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు దర్శి శాఖా గ్రంథాలయం నందు విద్యార్ధులతో కథలు చదవడం, కథలు చెప్పడం, స్పోకెన్ ఇంగ్లీష్, వేద గణితం మరియు క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు కే.నాసరయ్య, యస్. వెంకటయ్య మరియు గ్రంథ పాలకురాలు యల్.సుమతి మరియు 36 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
