స్వాతంత్ర్య సమరయోధుడు సుందరయ్య -పుచ్చలపల్లి సుందరయ్య 38 వ వర్ధంతి సభ నిర్వహణ

దర్శి పట్టణం లోని సుందరయ్య భవనం లో శుక్రవారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి ఉప్పు నారాయణ అధ్యక్షతన జరిగింది. ముందుగా సుందరయ్య చిత్రపటానికి సిపియం దరిశి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సీనియర్ నాయకులు సందు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…. 13 సంవత్సరాల వయసు లోనే గాంధీ జీ పిలుపుతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం , విదేశీ వస్తు బహిష్కరణ , క్విట్ ఇండియా ఉధ్యమాలలో పాల్గొని సుందరయ్య జైలు శిక్ష అనుభవించారని , కమ్యూనిస్టు పార్టీ విధానాలు ఆకర్షించిన తరువాత పార్టీ ఉధ్యమాలకు అంకితం అయి చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డారని అన్నారు. తెలంగాణ సాయుధపోరాటం , అంటరానితనం పై , దున్బేవానికే భూమి పోరాటాల ద్వారా పేద ప్రజల కోసం జీవితాంతం పోరాడి తన ఆస్తి మొత్తం పేద ప్రజల కోసం త్యాగం చేసిన మహానీయుడు అని , పార్లమెంటు లో మొదటి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సైకిల్ పై వెళ్ళెవారని , ఆయన ప్రసంగాలు , అచరణ నేటి తరానికి స్పూర్తి గా ఉన్నాయని కొనిఆడారు. సుందరయ్య గారు చూపిన బాటలో నేటి యువత నడవాలని , ప్రజలు ఉద్యమాల లోకి వచ్చి తమ హక్కులను కాపాడుకోవాలని ఆదే ఆయనకు అర్పించే నివాళి ఆవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో సిపియం నాయకులు ఉప్పుటూరి నాగరాజు , అంజిబాబు , ఈమని నాగేశ్వరరావు , ఆర్. రామ్ కోటిరెడ్డి, షేక్ కాలే భాషా , ఆది నారాయణ , రంగనాయకులు , కావ్యా , రవితేజ , రాహుల్ సాయి , రాజు పాల్గొని నివాళులు అర్పించి , సుందరయ్య చూపిన బాటలో ప్రజల కోసం పోరాడతామని ప్రతిజ్ఞ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *