తాళ్లూరు మండలంలోని నాగంబొట్లపాలెం గ్రామకార్యదర్శికి ఇన్చార్జి ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసారు. నాగంబొట్ల పాలెం గ్రామకార్యదర్శి పురం నరేంద్ర వలంటీర్ల విధులు. రికార్డుల నమోదులో సక్రమంగా లేక పోవటంపై వివరణ అడిగారు. అదే విధంగా శివరామపురం ఇన్చార్జి గ్రామకార్యదర్శిగా నియమితులైన తర్వాత రికార్డులు అప్పగించక పోక పోవటంపై బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు ఇన్చార్జి తీసుకున్నట్లయితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్లు జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. దీంతో తనపై ఆరోపణలు చేయటం సమజసం కాదని అందుకు వివరణ అడుగుతూ షోకాజ్ నోటీస్ జారీ చేసారు.
గ్రామకార్యదర్శికి షోకాజ్ నోటీస్ జారీ
19
May