జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి, సుబ్బ లక్ష్మమ్మ దంపతుల కుమార్తె కోట రాధ(35). ఈమెకు తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ మోహన్ రెడ్డి తో వివాహమైంది. ఉద్యోగ రీత్యా హైద రాబాద్ లో స్థిరపడ్డారు. రాధ బాల్య స్నేహితుడు అప్పటికే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి కుటుంబ స్నేహితుడిగా మసిలే వాడు. హైదరాబాద్లో తాను పనిచేస్తున్న కంపెనీ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో తనకొక ప్రాజెక్ట్సు ఆలో చన ఉందని.. అందుకు డబ్బు అవసరమని రాధ, మోహన్ రెడ్డి దంపతులకు చెప్పాడు. స్నేహధర్మంగా వారు రూ.80 లక్షల వరకు అప్పుగా ఇచ్చారు. అనంతరం అతను ఎంతకే తిరిగివ్వక పోవడంతో జెల్లెళ్లపాడు నుంచి తన తల్లిదండ్రులు, బంధువులతోనూ రాధ అడిగించారు. అనేకసార్లు అతన్ని ఫోన్లో నిలదీశారు. అయినా లాభం లేకుండా పోయింది.
చౌడే శ్వరి కొలుపులు ఉండటంతో ఈ నెల 11న తన చిన్నకుమా రుడితో కలసి రాధ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు కనిగిరి వస్తే తన అనుచరులు వచ్చి. కొంత నగదు ఇస్తారని ఈ నెల 17న ఆమెను నమ్మించాడు.
డబ్బులు ఇస్తానని సెల్ నుండి సందేశం పంపడంతో రాధ స్వగ్రామం నుంచి చిన్న కుమారుడిని తీసుకుని కనిగిరి చేరు కున్నారు. కుమారుడిని తన చిన్నాన్న ఇంటిలో వదిలి పామూరు బస్టాండు సెంటర్ కు చేరుకుంది. సరిగ్గా సాయంత్రం 6.47 గంటల సమయంలో ఆ ప్రాంతానికి ఒక ఎరుపు రంగు కారు వచ్చి ఆగింది. అందు లోని వ్యక్తులను చూసి ఆమె ఒకడుగు వెనక్కి వేశారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. ఆ తర్వాత పామూరు రోడ్డులోని గుజ్జుల యలమందారెడ్డి విగ్రహం వద్ద ఆమెను తిరిగి కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు.
విషయం తెలియని ఆ మహిళ అతన్ని నమ్మింది. తీసుకున్న డబ్బులో కొంత చెల్లిస్తానంటే తన వెంటే వెళ్లింది. నమ్మి వచ్చిన మహిళపై అత్యంత క్రూరంగా, పాశవికంగా, దుర్మార్గంగా వ్యవ పారించాడు. గుంపుతో కలిసి బతికుండగానే నరకం చూపాడు. చివరికి ప్రాణాలు తోడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.
ఆ కారులో నిందితుడు ఉండి ఉంటాడని.. అపరిచిత వ్యక్తులు కూడా ఉండటంతో ఆమె సందేహించి వెనకడుగు వేసి ఉంటారని భావిస్తున్నారు. అయినప్పటికీ పట్టువిడవని నిందితుడు ఆమెను నమ్మించి తీసుకెళ్లి మట్టుబెట్టి ఉంటాడనే చర్చ సాగుతోంది. అసలు ఆ కారులో ఎవరెవరు ఉన్నారనే విషయం ఇప్పుడు ప్రశ్నార్ధ కంగా మారింది. పామూరు బస్టాండ్ సెంటర్లో కనిపించిన ఆ కారు హైదరాబాద్ కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. హత్యలో పాల్గొన్నవారు హైదరాబాద్ నుంచి వచ్చారా.? బెంగుళూరు వారా.. స్థానికంగా ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
వెలిగండ్ల మండలం జిలైళ్లపాడులో చోటుచేసు కున్న ఈ అమానవీయ ఘటనలో అనేక విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి.
‘ అఘాయిత్యమా! అప్పు కోసమా!!
*దర్యాప్తు చేస్తున్నాము…కని గిరి డీఎస్సీ రామరాజు*
రాధను హత్య చేసిన నిందితులను పట్టుకునేం దుకు రాష్ట్రంతో పాటు, తెలం గాణ, కర్ణాటక తదితర ప్రాంతాలకు పోలీసు ప్రత్యేక బృందాలను పంపినట్టు కని గిరి డీఎస్సీ రామరాజు తెలి పారు. స్థానిక సీఐ కార్యాల కనిగిరి డీఎస్సీ రామరాజు నిర్వహిం
చిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాధ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ప్రధాన నిందితుడిగా భావిస్తున్న వారిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రతి చెక్ పోస్ట్లోని సీసీ కెమెరాలను పరిశీలి స్తున్నామన్నారు. పాటు, మరో నలుగురు ఈ హత్యోదంతంలో పాల్గొన్నట్టు భావిస్తున్నామని, అత్యా చారం చేసి హత్య చేశారా.. లేక తీసుకున్న అప్పు ఆడు గుతుందనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కాశిరెడ్డి స్నేహితులు, బంధువులను అదుపులోకి తీసుకుని విచారి స్తున్నామని..
కారులో ఎక్కే ముందు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కనిగిరి సర్కిల్ పోలీస్లు అప్రమత్తమై కేసు దర్యాప్త కొనసాగిస్తున్నారన్నారు. సమావేశంలో సీఐ శివరామకృష్ణ, ప్రసాద్ పాల్గొన్నారు.
