దర్శి విద్యుత్సబ్ స్టేషన్ వద్ద సబ్ స్టేషన్ ఆధీనంలో ఉన్న స్థలంలో పలువురు స్థలం తమదే అంటూ ప్రొక్లయిన్ సహాయంతో ఆదివారం బాగు చేయటం వివాదాస్పదమైనది. విద్యుత ఉద్యోగులు. ఆ స్థలం తమదే అంటూ అక్కడికి వచ్చిన వారు వాదోపవాదనలకు దిగారు. విద్యుత్ ఎఈ ప్రసాద్ రెవిన్యూ, ఎస్సై రామక్రిష్ణకు ఫిర్యాదు చేసారు. ఎస్సై సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ ఎఈ ఫిర్యాదు మేరకు ఆక్రమణంగా స్థలంలోనికి ప్రవేశించటంతో పాటు విద్యుత్ లైన్మెన్ విధులకుఆటంకపరచారన్న ఫిర్యాదు చేసారు. ఎఈ ఫిర్యాదు మేరకు పోలేపల్లి సత్యనారాయణ,
వెంకట రెడ్డి మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద స్థలంపై వివాదం – కేసు నమోదు
21
May