నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు ఆదివారం గుంటి గంగలో నిర్వహించారు. ఒంగోలు పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి శాగం కొండా రెడ్డి అధ్యక్షతన సభను నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, నారపుశెట్టి పాపారావు, విజయకుమార్, హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్. నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య పాల్గొని ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితం ప్రాముఖ్యతను వివరించారు.
ముందుగా స్థానిక నాయకులతో కలసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు ఆర్పించారు.
వైద్యశిబిరం, రక్తదానం నిర్వహించారు.
చంద్రబాబే ఇన్ చార్జిగా భావించి పనిచేయాలి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల
దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిని నియమిం చాలని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తరుచూ అడుగుతున్నారని, ఇన్ చార్జిని నియమించే వరకు అధినేత చంద్రబాబే మా ఇన్చార్జిగా భా వించి పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామ చర్ల జనార్దన్ తెలిపారు. గుంటిగంగవద్ద ఆదివారం జరిగిన ఎన్టీఆర్ శ త జయంతి ఉత్సవాల్లో దర్శి నియోజవర్గ పార్టీ శ్రేణులకు దామచర్ల
వెల్లడించారు. ఇన్చార్జి లేకున్నా పార్టీ కార్యక్రమాలను నేతలు ప్రజల్లోకి తీసుకవెళ్లి పార్టీ అభ్యున్నతికి పాటు పడాలన్నారు. ఇన్చార్జిని నియమిం చే వరకు చంద్రబాబును ఇన్చార్జిగా భావించాలన్నారు. ఇన్చార్జి విష యమై పార్టీ నిర్ణయం తీసుకుని త్వరలో సమర్థవంతమైన నాయకుడిని నియమిస్తామన్నారు. కార్యకర్తలందరూ కలిసి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో తాళ్లూరు మండల అధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి వల్లభనేని చిన సుబ్బారావు, తూర్పుగంగవరం గ్రామ టీడీపీ అధ్య క్షుడు కనిశెట్టి రామలక్ష్మయ్య, దర్శి నియోజకవర్గ టీడీపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ మీరామోహిద్దీ న్, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొల్లపూడి వేణుబాబు, ఎడమ కంటి శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, సాగర్ ఆదినారాయణ రెడ్డి టీడీపీ మహిళానాయకులు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

