మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వెలుగువారిపాలెం, విఠలాపురంలో ఆది వారం గ్రామసభలు నిర్వహించారు. త్వరలో తాళ్లూరులో మండల స్థాయిలో సామాజిక తనిఖీల సభ జరుగనున్న నేపథ్యంలో ముందుగా గ్రామస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి గతేడాది కాలంలో చేసిన పనులు వివరాలు గురించి డీఆర్పీ నాగరాజు వెల్లడించారు. ఈ సందర్భంగా కొందరు కూలీలు చేసిన అభ్యంతరాలపై చర్చిస్తామన్నారు. సర్పంచులు మారం ఇంద్రసేనా రెడ్డి, ఎం. కోటేశ్వరమ్మ, ఈసీ ఎం. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
