ప్రతి పేద వానికి నివాసం ఏర్పాటు చేయటమే లక్ష్యం – జగనన్న లే అవుట్లో రెండు ముఖ ద్వారాలకు శంకు స్థాపన – పేదల నివాస స్థలాలపై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గు చేటు … మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి

ప్రతి పేద వానికి స్వంత నివాసం ఏర్పాటు చేయటమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేసారని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్కొన్నారు. దర్శి ఆర్బన్ హౌసింగ్ లే అవుట్ రూ. 14 లక్షల వ్యయంతో నిర్మించనున్న రెండు ముఖ ద్వారాలకు ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు లే అవుట్ లో 683 మంది పేదలకు స్వంత గృహాలకు ఏర్పాటుకు పట్టాలు పంపిణీ చేసామని, పూర్తి స్థాయి | మౌళిక వసతులు ఏర్పాటు చేసామని చెప్పారు. నివాసాలు 362 నివాసాలు వివిధ దశలలో ఉన్నాయని అధికారులు చెప్పారని ఇప్పటికే 50 పూర్తి అయ్యాయని అన్నారు. అన్ని నివాసాలు పూర్తి అయితే జగనన్న కాలనీలు గ్రామాలుగా మారి ఎంతో సుందరంగా ఉంటాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ జీఎస్ అచ్చారావు, నగర పంచాయితీ కమీషనర్ మహేష్, హౌసింగ్ డీఈ నిరీక్షణరావు, ఎఈ షాకీర్ బాష, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి. కాల్సిలర్పీసీ రెడ్డి, మేడగం మోహన్ రెడ్డి, నాయకులు వారం వాసుదేవ రెడ్డి, ఎదురు శ్రీనివాస రెడ్డి, యర్రయ్య, వెంకటేశ్వర రెడ్డి, మిల్లర్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
పేదల నివాస స్థలాలపై మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గు చేటు …
ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి
ప్రభుత్వం ఆమరావతిలో పేదలకు ఇస్తున్న స్థలాలపై మాజీ ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు విషయం చిమ్ముతూ మాట్లాడటం సిగ్గుచేటని ఎమ్మెల్యే డాక్టర్ ద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. పేదలకు ఇచ్చే స్థలంలో శవాలు పూర్చటానికి కూడ పనికి రావలని వ్యాఖ్య చేయటం వారికి పేదల పట్ల ఉన్న భావనను తెలియజేస్తుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడ పేదలకు స్థలాలు ఇవ్వని చంద్రబాబు నాయుడు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం దురదృష్టకమని వీటిని తీవ్రంగా ఖడిస్తున్నట్లు చెప్పారు. పేదలకు ఇచ్చిన స్థలాలు ఎంత విలువైనవో, వాటిల్లో రోడ్లు, మౌళిక వసతులు ఎలా ఉన్నావో అనే దానికి దరి అర్చన్ లే అవుట్ నిదర్శమని
అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *