ముండ్లమూరు మండలంలోని బృందావనం గ్రామానికి చెందిన వైసిపి నాయకులు కుంటా అచ్చారావు, ఎలిసెమ్మ దంపతుల కుమారుడు కుంటా అనిల్ ,రేవతి ల వివాహ కార్యక్రమానికి దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ సోమవారం హాజరైనారు. కుంటా అనిల్ రేవ తి ల వివాహ కార్యక్రమానికి హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే రాకతో పెళ్లి మండపం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, బ్యూటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజిరెడ్డి, దర్శి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గర్నెపూడి స్టీవెన్, మాజీ సర్పంచులు దాసరి ఏలియా, వడితా రామా నాయక్, తదితరులు పాల్గొన్నారు.


