ఎన్నికలముందు విద్యుత్తు చార్జీలు పెంచమని చెప్పి అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పటికి 7 సార్లు పెంచటం, ఎన్నడూలేని విధంగా విధిస్తున్న విద్యుత్తుకోతలతో ప్రజలు తల్లడిల్లుతున్నారని మండల టీడీపీ అధ్యక్షులు బి. ఓబులు రెడ్డి అన్నారు. రాష్ట్ర టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు స్థానిక 33/11 కెవి | విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద మండల టీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి ఆద్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఓబులు రెడ్డి మాట్లాడుతూ…. గత టీడీపీ పాలనలో 24 గంటలు విద్యుత్తు నిరాఘాటంగా సరఫరా జరిగేదన్నారు. నేడు నిత్యం విద్యుత్తు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒంగోలు పార్ల మెంట్ టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి శాగంకొండారెడ్డి మాట్లాడుతూ…
వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 7 సార్లు పెంచి ప్రజలపై భారంమోపిందన్నారు.
టి. డి. పి ప్రభుత్వంలో విద్యుత్తు బిల్లు చెల్లించలేని విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. విద్యుత్తు చార్జీలను తగ్గించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పొలాలకు చెందిన మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులు విద్యుత్తు చార్జీలు చెల్లించ లేక ఉరి తాడుకు బలికావాల్సి వస్తుందని, మీటర్ల ఏర్పాటు ప్రయత్నాన్ని విరమించుకోవాలని తెలిపారు. విద్యుత్తు చార్జీలను తగ్గించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్ వద్ద గంటపాటు కూర్చుని నిరసన నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, టీడీపీ నేతలమేడగం వెంకటేశ్వరరెడ్డి ఐ.శ్రీనివాసరెడ్డి, పిన్నిక రమేష్ బాబు, షేక్ మీరామోహిద్దీన్,కె. రామకోటి రెడ్డి,రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి గొల్లపూడి వేణుబాబు, నుసుం ఆది నారాయణరెడ్డి. రామలక్ష్మయ్య, సిహెచ్ వీరనాగిరెడ్డి,నల్లపాటి సత్యం. పుట్టా నరసింహారావు, జాష్టి శ్రీనివాసులు, వంగపల్లి నాగేశ్వరరావు, చాట్లడాని, తూము లక్ష్మీరెడ్డి, సిహెచ్ నాగేశ్వరరావు, హనుమారెడ్డి, వల్లభనేని శ్రీను, నాదెండ్ల శ్రీను,స్వామి దాసు కైపు నాగార్జునరెడ్డి, పాలెపోగు దాసు, నేరెళ్ల కిషోర్ కుమార్, తదితరులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
