కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ గా యూటీ ఖదీర్ ఎన్నికయ్యారు. ఆయన దక్షిణ కన్నడ జిల్లా నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి మెజార్టీ సాధించింది.
సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, 8 మంది మంత్రులు తొలుత ప్రమాణ స్వీకారం చేశారు.