వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మైనార్టీ, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు గత నాలుగేళ్లుగా జగనన్నకు జేజేలు పలుకుతున్నారని వక్తలు అన్నారు. నాగంబొట్ల పాలెంలో మంగళవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయి నాలుగు వసంతాలు పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేసి, ప్రజలకు అన్నదానం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి. స్థానిక సర్పంచి చిమటా సుబ్బారావు, సొసైటీ చైర్మన్ శనివారపు శ్రీనివాస రెడ్డి, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు సోము ఆనిల్ కుమార్ రెడ్డి, సర్పంచిలు వలి. పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, సోషన్ మీడియా కన్వినర్ సజీవ్ తదితరులు పాల్గొని సందేశం అందించారు.

