బత్తాయిలో వేరు కుళ్లు తెగులు – నివారణ చర్యలు తీసుకోవాలి – వ్యవసాయ అధికారి ప్రసాదరావు -ఉద్యాన వన సాగుదారులకు సూచన

బత్తాయిలో వేరుకుళ్ళు తెగులు వ్యాపించడం వల్ల దిగుబడి తగ్గి రైతులకు నష్టం ఏర్పడే అవకాశం ఉందని దీని నివారణ చర్యలు పాటించడం వల్ల లాభాలు పొందవచ్చని తాళ్లూరువుమండల వ్యవసాయ అధికారి బి ప్రసాదావు అన్నారు. మండలంలోని రామభద్రాపురం, నాగం బొట్లవారిపాలెం గ్రామాలలో క్షేత్ర పర్యటన సందర్భంగా ఆయన బత్తాయి తోటలను పరిశీలించారు. రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మండలంలో 2000 ఎకరాలకు పైగా బత్తాయి సాగు జరుగుతుందని, వేసవికాలంలో బత్తాయి చెట్లకు సాధారణంగా వేరుకుళ్లు తెగులు వ్యాపించే అవకాశం ఉందని దీని నివారణ చేపట్టినట్లయితే దీని నుండి ఉపశమనం పొంది మంచి బత్తాయి దిగుబడి సాధించవచ్చని తెలిపారు. నివారణ చర్యలో భాగంగా వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి వేరు కుళ్ళు తెగులు నివారణ పొందవచ్చని ఆయన సూచిం చారు. చెట్ల ఆకులను, ఎరువులను కలిపి చెట్ల మొదళ్లలో వేయాలని ఆయన తెలిపారు. దీనివల్ల ఆకులు వ్యర్థాలు కుళ్ళి సూక్ష్మజీవులు నశిస్తాయని ఆయన సూచించారు. అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్పెటన్ను చెట్ల మొదళ్లలో ఉపయోగించి చెట్ల ఆకులను కుళ్ళిపోయేటట్లు చేయడం ద్వారా పచ్చి రొట్టెను ఏర్పాటు చేసుకొని కొంతవరకు సూక్ష్మజీవులు నశిస్తాయని ఆయన సూచించారు. దీనితో పాటు మరికొన్ని నివారణ చర్యలను రైతులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు డి శ్రీను, రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *