ముండ్లమూరు మండలంలో నూతన పంచాయతీ బృందావనం తండాలో ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలపై ఘర్షణకు దిగారు. బుధవారం ఉపాధి హామీ అక్రమాలను విచారణ చేసేందుకు గాను దర్శి ఏపీ డి పద్మశ్రీ గ్రామానికి వెళ్లారు. గ్రామ శివారులో జరుగుతున్న పనుల వద్దకు వెళ్లి అక్రమాలపై విచారణ చేపట్టేందుకు చర్యలు మొదలుపెట్టారు. దీంతో మరో వర్గం వారు అక్రమాల గురించి చెబుతుండగా ఇంకొక వర్గం వారు ఘర్షణకు దిగారు దీంతో ఆమె అక్కడ నుండి వెళ్లిపోయారు. గ్రామంలో పనులకు రాని కూలీలకు మస్టర్లు వేసి అధిక మొత్తంలో కూలి వేస్తూ, పనులకు వెళ్లిన వారికి కూలి గిట్టుబాటు లేకుండా వేస్తున్నారని స్థానిక సర్పంచ్ జానవతు లక్ష్మీబాయి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో కలెక్టర్కు,ద్వామా ప్రాజెక్టు పిడికి వినతి పత్రం అందజేశారు. దీంతో దర్శి క్లస్టర్ ఏపీ డి నీ విచారణ అధికారినిగా నియమించారు. సుమారు 100 మందికి పైగా కూలీలు వలస వెళ్లగా వారందరికీ అక్రమంగా మస్టర్లు వేసి అక్రమాలకు పాడుపడుతున్న క్షేత్ర సహాయకుడి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి పథకంలో అక్రమాలకు పాల్పడుతున్న క్షేత్ర సహాయకుడిని తీసివేయాలని అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళగా, మరల అధికారులు అతనిని నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. పేదలకు ఉపాధి కల్పించే పనుల్లో అధికారులు సిబ్బంది కుమ్మక్కై పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతూ దోచుకుంటున్నారని సర్పంచ్ జానా వత్తు లక్ష్మీబాయి తెలిపారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఉపాధి పనుల్లో మస్టర్లలో అక్రమాలను వెలికి తీసి కూలీలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జానా వత్తు చిన్న నాయకు, సభా వత్తు రవి నాయక్, బాల నాయక, బాల నాయక, పెద్ద స్వామి నాయక్, భూక్య చక్రవర్తి, బుజ్జి బాయ్, శాంతి భాయి, జానవత రాములు నాయక్, సేవా నాయకు భూక్య తులసి నాయక్, చాంద్లాల్ నాయక్, సోబిలి భాయి, స్వప్న భాయ్ తదితరులు ఉన్నారు.
