ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్ల మూరుతో పాటు వేంపాడు, చంద్రగిరి, పసుపుగల్లు ,సింగనపాలెం, తమ్మలూరు గ్రామాలలో బుధవారం సాయంత్రం ఒక మాదిరి వర్షం కురిసింది. ఈమధ్య తీవ్రమైన ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అరగంట పాటు వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడడంతో ప్రజలు సేద తీర్చుకున్నారు.
ముండ్లమూరులో మోస్తరు వర్షంతో సేద తీరిన ప్రజలు
24
May