సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహణ -పంచాయితీలలో గుర్తించిన లోపాలను ప్రజా వేదిక దృష్టికి తెచ్చిన తనిఖీ బృందం- పరిశీలించిన డ్వామా పీడీ శ్రీనా రెడ్డి

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 2022- 23 ఆర్ధిక సంవత్సరంలో నిర్వహించిన పనులకు గురువారం సామాజిక తనిఖీలో గుర్తించిన లోపాలను గురువారం నిర్వహించిన ప్రజా వేదికలో తనిఖీ బృందం వెలువరించారు. జిల్లా డ్వామా పీడీ శ్రీనా రెడ్డి ముఖ్య అతిధిగా ప్రజా వేదికలో పాల్గొని ఆయా పనులలో కనుగొన్న అవకతవకలపై సమీక్షించారు. మండలంలో వివిధ శాఖలలో రూ. 7.78 కోట్ల వ్యయంతో చేపట్టిన 676 పనులు చేపట్టినట్లు ఎస్.ఆర్. పి తులసీ నాయక్ తెలిపారు. అందులో 16 పంచాయితీలలో గుర్తించిన లోపాలను డీఆర్పీలు సభ దృష్టికి తెచ్చారు. అందులో రూ. 18,798 లు రికవరీకి, 30,218లు ఉన్న తాకాధికారులతో మరోకసారి విచారణకు, రూ.70,499ల విలువైన పనులకు మరలా కొలతల ప్రకారం చేయించాలని, రూ.3,300 పలువురి సిబ్బందికి జరిమానాను పీడీ శ్రీనా రెడ్డి విధించారు. ఉద్యాన వన పంటలు సాగు చేసిన రైతులకు పలు గ్రామాలలో చెల్లించిన నీటి బిల్లులతో డ్రైవ్లోను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించినట్లు ఎస్.ఆర్.పి తులసీనాయక్ చెప్పారు. అయితే రైతులు తమ స్వంతగా ఏర్పాటు చేసుకున్నా సరే మొక్కలను బ్రతికించి ఫలంలోనికి తీసుకువస్తే ఆబిల్లులు సక్రమంగా వినియోగంలోనికి వచ్చినట్లుగా గుర్తించాలని సూచించారు. సభలో జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ సోము అనిల్ కుమార్ రెడ్డి, సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్, మారం ఇంద్రసేనా రెడ్డి, వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కెఎస్ శివలక్ష్మి, ఎం. బ్రహ్మా రెడ్డి, ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు, విజిలెన్స్ అధికారి ఝాన్సీ, విజలేన్స్ ఎస్ . ఏ వెంకట స్వామి , అంబుడ్స్ మెన్ మీరావలి, ఏపీఓ మురళి, ఈసీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *