నాడు- నేడు పనులు జరుగుతున్న పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలలో
పాఠశాల అడ్మిషన్స్ కు ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలని ఎంఈఓ జి. సుబ్బయ్య అన్నారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో
గురువారం మండలంలో జరుగుతున్న నాడు – నేడు పనులపై ప్రధానోపాధ్యాయులతో, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అంగన్వాడీ సూపర్ వైజర్ ల తో సమీక్ష నిర్వహించారు. మండలంలోని 30 పాఠశాలలు, అంగన్వాడీలలో నాడు- నేడు పనులు జరుగుతున్నట్లు నాడు- నేడు ఎఈ పి. గోపి చెప్పారు. ఆయా
పాఠశాలలో నీటి వసతి, టాయిలెట్స్ . తాత్కాలిక మరమ్మత్తులు, బోర్డుల ఏర్పాటు వంటి పది పనులపై త్వరగా పూర్తి చెయ్యాలని ఎంఈఓ సుబ్బయ్య కోరారు.
