తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో గురువారం సాయంత్రం కురిసిన గాలి,
వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు. పలు చోట్ల రేకులు నెలకు వరిగాయి. దీంతో
విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడినది. దాదాపు 15 విద్యుత్ స్తంభాల వరకు నెల కొరగటం. విద్యుత్ లైన్స్ పై చెట్లు పడిపోవటంతో విద్యుత్ పునరుద్ధరణకు విద్యుత్ సిబ్బంది శ్రమిస్తున్నారు. బొద్దికూరపాడు – రాజంపల్లి రోడ్లో మంచి నీటి బావి వద్ద పెద్ద తుమ్మ చెట్టు ఆర్ అండ్ రోడ్కు అడ్డంగా పడటంతో ట్రాఫిక్ గంట పాటు స్తంభించినది. విఘ్నేశ్వర స్వామి ఆలయంలో నిమ్మచెట్టు వేర్లు పైకి లేని పడ్డాయి. గ్రామంలో దాదాపు అన్ని వీధులలో చెట్లు నెలకొరగటంతో వీధులన్ని అస్తవ్యస్థం అయినట్లు గ్రామస్తులు వాపోతున్నారు

