కానిస్టేబుల్ పవన్ కుమార్ కు కన్నీటి వీడ్కోలు -అధికార లాంఛనాలతో పవన్ కుమార్ అంత్యక్రియలు-నివాళులర్పించిన ఎస్పీ, ట్రైనీ ఎస్సీ, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే – కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పోలీస్ శాఖ భరోసా

విధి నిర్వహణలో పాముకాటుకు గురై మృతి చెందిన కానిస్టేబుల్ ఇరిగినబోయిన పవన్ కుమార్ కు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పోలీస్ అధికారులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఎస్పీ మలికాగర్గ్ ఆధ్వర్యంలో గురువారం చీమ కుర్తిలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పవన్ కుమార్ భౌతికకాయానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ట్రైనీ ఎస్పీ అంకితా సురానా, ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి నివాళులర్పించారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటామని కానిస్టేబుల్ కుటుంబ సభ్యు లకు భరోసా ఇచ్చారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరి ధిలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న పవన్ అమరావతి సమీపంలోని తుళ్ళూరులో విధులు నిర్వహిస్తూ ఈ నెల 23వ తేదీ రాత్రి నిద్రిస్తున్న సమ యంలో పాముకాటుకు గురై చికిత్స పొందుతూ 24వ తేదీ రాత్రి మృతి చెందిన సంగతి తెలిసిందే. భౌతికకాయాన్ని గురువారం పవన్ కుమార్ స్వగ్రా మమైన చీమకుర్తి పట్టణంలోని దిన్నేపురానికి తీసుకొచ్చారు.
కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిం చారు. చీమకుర్తికి చెందిన ఇరిగినబోయిన రామకృ ష్ణ, పద్మకు ఇద్దరు కుమారులు, కుమార్తె కాగా, వారిలో రెండో కుమారుడు పవన్ కుమార్ 2012 బ్యాచ్లో పోలీసు కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
పవన్ కుమార్ భౌతికకాయాన్ని చూడగానే తల్లిదం డ్రులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భావోద్వేగా నికి గురై రోదించారు. వారిని ఎస్పీ మలికాగర్గ్, ప్రజాప్రతినిధులు ఓదార్చారు. పోలీసు శాఖ తర పున రావాలసిన పరిహారం, ఇతర ప్రయోజనాలను వీలైనంత త్వరగా అందిస్తామని, అన్ని విధాలా అండగా ఉంటామని పవన్ కుటుంబ సభ్యులకు ఎస్సీ భరోసా ఇచ్చారు. అనంతరం పోలీసులు గన్సె సేల్యూట్ చేసి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి దహన .సంస్కారాలు పూర్తి చేశారు. కార్య క్రమంలో డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, డీఎస్బీ డీఎస్పీ మరియదాసు, ఒంగోలు రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్సై లు జి.రామి రెడ్డి, ప్రేమ్ కుమార్ నరసింహారావు, పోలీసులు, అధిక సంఖ్యలో తాళ్లూరు మండల ప్రజలు నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *