తప్పిపోయిన పిల్లలను చేరదీయండి – న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహణ – లోక్ అదాలత్ చైర్మన్ సీనియర్ న్యాయమూర్తి జి. ఎల్. వి. ప్రసాద్

పలు కారణాలతో తల్లిదండ్రుల నుంచి తప్పి పోయిన పిల్లలను చేరదీసేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకో వాలని లోక్ అదాలత్ చైర్మన్, సీనియర్ న్యాయమూర్తి జి. ఎల్. వి. ప్రసాద్ సూచించారు. ‘అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల సంరక్షణ దినం’ సంద ర్భంగా స్థానిక కోర్టులో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో గురువారం ఆయన పాల్గొన్నారు. లోక్ అదాలత్ చైర్మన్ ,సీనియర్ న్యాయమూర్తి జి. ఎల్. వి. ప్రసాద్ మాట్లాడుతూ… తప్పి పోయిన పిల్లలు హోటళ్లు, మెకానిక్ షెడ్లు వంటి చోట వెట్టిచాకిరీ చేస్తున్నారని వీరిని గుర్తించి ఆ పనుల నుంచి విముక్తి కల్పించాలన్నారు. ఇలాంటి పిల్లలకు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రత్యేక వసతిగృహాలు ఏర్పాటు చేశారని వివరించారు. డీటీ రవిశంకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోటి రెడ్డి, న్యాయవాదులు చెన్నకేశవులు, సురేష్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
Prev ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సిద్ధంవిద్యార్థుల‌ మార్పిడి, వైద్య ప‌రిశోధ‌న‌లో భాగ‌స్వామ్యంఎంవోయూలు సిద్ధం చేసుకుందాంమేధోసంప‌త్తి తెలుగువారి సొంతంభార‌త్‌లో జ‌ర్మ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ మైకేలా కుచ్ల‌ర్‌మెడ్‌టెక్ జోన్‌లో పెట్టుబ‌డులు పెట్టండిజ‌ర్మ‌న్ కంపెనీల‌కు అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తాంవీసా గ‌డువు క‌నీసం నాలుగేళ్లు ఉండేలా చూడండిఏజెన్సీల‌కు అధికారిక గుర్తింపు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోండిజ‌గ‌న‌న్నగొప్ప సంస్క‌ర‌ణ‌ల ఫ‌లితంగానే ఏపీలో అద్భుతాలురాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జినిజ‌ర్మ‌న్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ మైకేలా కుచ్ల‌ర్‌తో మంత్రి ర‌జిని ప్ర‌త్యేక భేటి
Back to list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *