దరిశి చిల్డ్రన్స్ క్లబ్ అధ్వర్యంలో 15 సంవత్సరాల లోపు బాల బాలికలకు బాలోత్సవం (సమ్మర్ ట్రైనింగ్) శనివారం నిర్వహించారు. దరిశి సుందరయ్య భవన్ లో చిల్డ్రన్స్ క్లబ్ రాష్ట్ర నాయకురాలు కె.రమాదేవి ప్రారంభించి శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …నేటి సమాజంలోని బాల బాలికలలో సామాజిక విజ్ఞానం, వినోదం, వికాసం కరువు ఆవుతున్నాయని , వాటిని పెంపొందించే లక్ష్యాలతో రాష్ట్రంలో చిల్డ్రన్స్ క్లబ్ విజయవాడ వేధికగా బాలోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వేసవికాలంలో డ్రాయింగ్ , ఆటలు , పాటలు పాడటం , డ్యాన్స్ వేయడం , నృత్య రూపాకాలు , ఫన్ మ్యాధ్స్ , నితి కధలు, సైన్స్ సరదాలు , దేశభక్తి పెంపొందించడం తదితర అంశాలలో శిక్షణ ఇస్తున్నామని , దరిశి లో శని, ఆదివారంజరుపుతున్నాయని ,ఈ ట్రైనింగ్ కి పిల్లలు తల్లిదండ్రులు స్పందించి బాగా ఈ క్లాసులకు పంపుతున్నారని అమె తెలిపారు. శిక్షణ లో దరిశి గ్రంథాలయ అధికారి సుమతి పాల్గొని సందేశం ఇచ్చారు. ఈ శిక్షణ లో ప్రజా నాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షుడు బి.రాజా రమేష్ దేశభక్తి గీతాలు , బెల్యూన్స్ తో ఆటలు , బాల బాలికల అభిరుచులు , పేపర్ క్రాప్టింగ్ , నృత్యం నేర్పించారు.
DYFI జిల్లా కార్యదర్శి కె.వి పిచ్చయ్య ఈ ప్రారంభానికి అధ్యక్షత వహించగా 65 మంది బాలబాలికలు పాల్గొన్నారు.


