జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మూడు దశాబ్దాల తర్వాత ఆరు నుండి పదవ తరగతి వరకు చదివిన నాటి విద్యార్థులు సమావేశమైనారు. నాడు తమ అభున్నతికి పాటు పడిన గురువుల సేవలు గుర్తు చేసుకున్నారు. నాటి గురువులు డి. వెంకటేశ్వర రెడ్డి, మాస్టర్లు వి. వి. రమణయ్య, ఎం. సుబ్బారావు, ఎస్. అంజి రెడ్డి, వి. ఆంజనేయులు. ఎ. వి. సుబ్బారావు, బి. కోటి రెడ్డిలనుసన్మానించారు. ఆయా బ్యాచ్లో నాటి విద్యార్థులు సీహెచ్ నాగేశ్వరరావు, కోటి, రెడ్డి, ఎస్. కొండా రెడ్డి, రమణమ్మ, వెంకటేశ్వర రెడ్డి, పర దేశి. ఎస్. కొండారెడ్డి, సబ్ రిజిసార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







