ముండ్లమూరులో చోరీ -సుమారు రూ. 4 లక్షల విలువైన వస్తువులు చోరీ

ముండ్లమూరు మండల కేంద్రమైన ముండ్లమూరులో రిటైర్డ్ వీఆర్వో చీమలమర్రి లక్ష్మీకాంతారావు సతీమణి హైమావతి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి దొంగతనానికి పాల్పడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. హైమావతి భర్త మృతి చెం దడంతో మనవడితో కలిసి ముండ్లమూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం సమీపంలో నివాసముంటుంది. తన మనవరాలు నెల్లూరులో ఉండడంతో గురువారం మనవ డితో కలిసి వెళుతూ ఇంటిని, కుక్కను చూస్తూ ఉండమని పక్కింటి వాళ్లకు చెప్పి వెళ్లారు. పక్కింటి వారు రోజు గేటు బయట నుంచి కుక్కకు ఆహారం వేస్తున్నారు. ఈ క్రమం లో ఆదివారం ఉదయం కుక్కకు ఆహారం పెట్టేందుకు రాగా ఇంటి తలుపులు పగులకొట్టి ఉన్నాయి. దీంతో వారు అద్దంకిలో ఉంటున్న హైమావతి కుమారుడు శ్రీని వాసరావుకు సమాచారం ఇచ్చారు. శ్రీనివాసరావు ఇంటికి వచ్చి చూడగా బీరువు పగులగొట్టి అందులోని వస్తువులుచిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా..ఎస్సై సంపత్ కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ఓం వచ్చి వివరాలు, వేలిముద్రలు సేకరించారు. ఆరు సవర్ణ బంగారం, నగదు కలిపి సుమారు రూ. 4 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు బాధితురాలు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *