సాంకేతికత వినియోగంతో ఖర్చును తగ్గించుకోవాలి -తాళ్లూరువ్ మండల వ్యవసాయాధికారి ప్రసాదరావు

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా రైతులు సాకేతికత వినియోగంతో ఖర్చును తగ్గించుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. మండలంలోని లక్కవరం, నాగం బొట్లపాలెం, తాళ్లూరు, కొత్తపాలెం పరిధిలోని రైతులకు సోమవారం జై హనుమాన్ డీలర్ ద్వారా ఏరోస్పేస్ కంపెనీ రూపొందించిన డ్రోన్లు పిచికారి నిమిత్తం ఎలా ఉపయోగించుకోవాలలో రైతులకు ప్రదర్శించారు. ప్రభుత్వం రైతు మిత్ర గ్రూపుల ద్వారా కిసాన్ డ్రోన్లను అందిస్తుందని చెప్పారు. రైతు వాటా 10శాతం, ప్రభుత్వం 40 శాతం, బ్యాంకు ద్వారా రుణం 50శాతం కల్పిస్తుందని చెప్పారు. యూనిట్ విలువ 10 నుండి 15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం పైలెట్స్ను ఉచిత శిక్షణ ఇచ్చి సర్టిఫికేట్ లైసెన్స్ ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో తాళ్లూరు, నాగం బొట్లపాలెం సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, సుబ్బారావు. ఉప సర్పంచి మస్తాన్ వలి, విజిలెన్స్ కమిటీ మెంబర్ అనిల్కుమార్ రెడ్డి, ఉప సర్పంచి మస్తాన్ వలి, కోటేష్, విఏఏలు నాగరాజు నాయక్, వీరాంజనేయులు, శ్రీను, హనుమాన్ ప్రతినిథి కృపాల్, టెక్నిషియన్ పైలెట్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *