మహేంద్ర సింగ్ ధోని మంత్రజాలం ఐపీఎల్లో మరోసారి అద్భుతంగా పని చేసింది. తనకే సాధ్య మైనరీతిలో సాధారణ ఆటగాళ్లతోనే జట్టును నడిపించిన అతను ఐదో ట్రోఫీతో సగర్వంగా నిలిచాడు. 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అక్కడక్కడా తడబడినా చివ రకు సీఎస్కే గెలుపు సొంతం చేసుకుంది. మోహిత్ శర్మ వేసిన చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, తొలి 4 బంతుల్లో అతను 3 పరుగులే ఇచ్చాడు. దాంతో గుజరాత్ గెలుస్తున్నట్లుగా అనిపించింది. అయితే తర్వాతి రెండు బంతులను జడేజా 6, 4గా మలచి సూపర్ కింగ్స్ కు చిరస్మరణీయ విజయం అందించాడు. వరుసగా రెండో ఏడాది చాంపియన్ గా నిలవాలని భావించిన గుజరాత్ టైటాన్స్ చివరకు రన్నరప్ గా సంతృప్తి చెందింది. సాధారణంగా 215 పరు గుల లక్ష్యం అసాధ్యంగా కనిపించినా… వర్షం అంతరాయంతో ఓవర్లు తగ్గడం, చేతిలో 10 వికెట్లు ఉండటం కూడా చెన్నైకి మేలు చేసింది. చివరిదిగా భావిస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లో ధోని తొలి బంతికే గోల్డెన్ డకౌట్ గా వెనుదిరగా… ఐపీఎల్కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు తన కెరీర్లో ఆరో టైటిల్తో ఘనమైన ముగింపునిచ్చాడు.
*ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కిం గ్స్ చాంపియన్గా నిలిచింది* . సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్న ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96; 8 ఫోర్లు, 6 సిక్స్లు) సెంచరీ కోల్పోగా… వృద్ధి మాన్ సాహా (39 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్) శుబ్మన్ గిల్ (20 బంతుల్లో 39; 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఆనంతరం చెన్నై 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది. కాన్వే (25 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్లు), శివమ్ దూబే. (21 బంతుల్లో 32 నాటౌట్ ; 2 సిక్స్లు)రాణించారు. సమష్టి బ్యాటింగ్ ప్రదర్శన….
42 బంతుల్లో 67, 42 బంతుల్లో 64, 33 బంతుల్లో 81… తొలి మూడు వికెట్లకు వరుసగా గుజరాత్ భాగ స్వామ్యాలివి. జట్టులోని టాప్-4 తమ వంతుగా కీలకపాత్ర పోషించడంతో భారీ స్కోరు సాధ్యమైం ది. సాహా, గిల్ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ ఈ సీజ స్లో మరోసారి జట్టుకు శుభారంభం అందించారు. తుషార్ వేసిన రెండో ఓవర్లోనే 3 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన సునాయాస క్యాచ్లు దీపక్ చహర్ వదిలేసి గుజరాత్ కు మేలు చేశాడు. చహర్ ఓవర్లో సాహా సిక్స్, 2 ఫోర్లు కొట్టగా… తుషార్, తీక్షణ ఓవర్లలో గిల్ వరుసగా మూడేసి ఫోర్లు బాది జోరు ప్రదర్శిం చాడు. 21 పరుగుల వద్ద సాహా ఇచ్చిన క్యాబ్ను కూడా చహర్ వదిలేయడం టైటాన్స్కు మరింత కలిసొచ్చింది. ఎట్టకేలకు ధోని మెరుపు స్ధం. పింగ్తో గిల్ వెనుదిరగ్గా, . 36 బంతుల్లో సాహా ఆర్థ సెంచరీ పూర్తయింది. ఆ వెంటనే సాహా అవుట్ కాగా, సుదర్శన్ దూకుడు కొనసాగింది. తీక్షణ ఓవర్లో రెండు సిక్స్లు బాదిన అతను పతీరణ ఓవర్లో వరుసగా 2 ఫోర్లు కొట్టి 33 బంతుల్లోనే హాఫ్ సెంచ రీకి చేరుకున్నాడు. తుషార్ వేసిన తర్వాతి ఓవర్లో అతను మరింత చెలరేగిపోయాడు. తొలి నాలుగు బంతుల్లో అతను 6. 4. 4 కొట్టడం విశేషం. తుషార్ తర్వాతి ఓవర్లోనూ టైటాన్స్ 18 పరుగులు. రాబట్టింది. పతిరణ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 6, 6 కొట్టి 98కు చేరిన సుదర్శన్ తర్వాతి బంతికి దురదృష్టవశాత్తూ ఎల్బీగా దొరికిపోయి సెంచరీ చేజార్చుకున్నాడు. చివర్లో హార్థిక్ పాండ్యా (12 బం తుల్లో 21 నాటౌట్: 2 సిక్స్ లు) దాటి గుజరాతు మరింత పటిష్ట స్థితికి చేర్చింది. శుభారంభం….
అంతరాయం కలిగించడంతో డక్వర్డ్ లూయిస్ పద్దతి ప్రకారం చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనను చెన్నై ఘనంగా ప్రారంభించింది. దూకుడుగా ఆడిన ఓపెనర్లు రుతురాజ్. కాన్వే 4 ఓవర్ల పవర్ ముగిసేసరికి 7 ఫోర్లు, 2 సిక్స్ తో స్కోరును 52
పరుగులకు చేర్చారు. అయితే పవర్ తర్వాత చెన్నైని నియంత్రించడంలో బౌలర్లు సఫలము య్యారు. నాలుగు పరుగుల తేడాతో వీరిద్దరు వెనుది రిగారు. అయితే రుతురాజ్ (16 బంతుల్లో 26, 3 ఫోర్లు, 1 సిక్స్), రహానే (13 బంతుల్లో 27 2 ఫోర్లు, 2 సిక్స్లు), అంబటి రాయుడు (8 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్స్లు) తలా ఓ చేయి వేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు.
15 ఓవర్లకు కుదింపు…
రిజర్వ్ డే అయిన సోమవారం కూడా వాన మ్యాచ్ కు అంతరాయం కలిగించింది. సరైన సమయానికే ఆరంభమై గుజరాత్ పూర్తి 20 ఓవర్లు ఆడింది. అయితే చెన్నై ఇన్నింగ్స్ 3 బంతులకు 4 పరుగులు చేసిన తర్వాత ఈ మొదలైన వర్షం సుదీర్ఘ సమయం పాటు తెరిపినివ్వలేదు. వర్షం తగ్గినా, ప్రధాన పక్కన ఉన్న పిచ్ అరకపోవడంతో సమస్యగా మారింది. దానిని ఆరబెట్టేందుకు గ్రౌండ్స్మన్ అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు అర్ధరాత్రి 12.05 గంటలకు మ్యాచ్ మళ్లీ మొదలైంది. చెన్నై ఇన్నింగ్స్ను 15 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 171 పరుగులుగా నిర్దే శించారు. పవర్ప్లేను 4 ఓవర్లకు పరిమితం చేయగా, ఒక్కో బౌలర్ గరిష్టంగా 3 ఓవర్లు మాత్రం వేసేందుకుఅనుమతించారు. స్కోరు వివరాలు…
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) ధోని (బి) చహర్ 54, గిల్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 39; సుద ర్శన్ (ఎల్బీ) (బి) ప్రతిరణ 96, పాండ్యా (నాటౌట్) 21: రషీద్ (సి) రుతురాజ్ (బి) పతిరణ 0; ఎక్స్ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 214. వికెట్ల పతనం: 1-67, 2-131, 3-212, 4-21, బౌలింగ్: దీపక్ చహర్ 4-0-38-1, తుషార్ 4-0-56-0, తీక్షణ 4-0-36-0, జడేజా 4-0-38-1, పతిరణ 4-0-44-2
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: రుతురాజ్ (సి) రషీద్ (బి) సూర్ 26: కాన్వే (సి) మోహిత్ (బి) కాన్వే 47; దూబే (నాటౌట్) 32; రహానే (సి) విజయ్ శంకర్ (బి) మోహిత్ 27, రాయుడు (సి) అండ్ (బి) మోహిత్ 19: ధోని (సి) మిల్లర్ (బి) మోహిత్ (0); జడేజా (నాటౌట్) 15; ఎక్స్ ట్రాలు 5, మొత్తం (15 ఓవర్లలో 5 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1-74. 2-78, 3-117, 4-149, 5-149, బౌలింగ్: షమీ 3-0-29-0, పాండ్యా 1-0-14-0, 3-0-44-0. సూర్ 3-0-17-2 2-0-30-0, మోహిత్ శర్మ 3-0-38-3.
చెన్నై ఫైవ్ స్టార్…-ఐదోసారి ఐపీఎల్ టైటిల్ సాధించినసూపర్ కింగ్స్ -ఫైనల్లో 5 వికెట్లతో గుజరాత్-ఘన విజయం వర్షంతో మారిన లెక్కల్లోధోని సేనదే పైచేయి – ఆఖరి బంతికి గెలిపించిన జడేజా
30
May