గత పాలన కన్నా ఈ ప్రభుత్వ పాలనలో ప్రతి కుటుంబానికి మంచి జరిగితేనే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటు వేయ్యండని చెప్పిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణంలోని 10 వార్డులో లంకోజన పల్లి రోడ్లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పాల్గొని అర్హలందరికి సంక్షేమ పథకాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్నారని అన్నారు. ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల వివరాలతో ఉన్న కర పత్రాలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేసారు.
ఆయా కుటుంబాలకు అందిన లబ్దిని మహిళలు చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం నిత్యం పనిచేస్తున్నారని ఆయనకు అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో ఎఎంసీ చైర్మన్ వైవీ సుబ్బయ్య, ఎంపీపీ జీఎస్ అచ్చారావు, మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి (మహేష్) రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యుటిఫికేషన్ డైరెక్టర్ కుమ్మిత అంజి రెడ్డి, జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతి రెడ్డి, జెసీఎస్ కన్వినర్ ఎదురు కోటి రెడ్డి, కౌల్సిలర్లు బాబు రావు స్థానిక నాయకులు వార్డు ఇన్చార్జి చెరుకూరి జగన్మోహన్ రావు, ఎదురు శ్రీనివాస రెడ్డి, పాశం జయసింహా, అంకాల శ్రీను, గురవయ్య, బాష, మిల్లర్ బుజ్జి, యర్రయ్య, గంజి వెంకటేశ్వర రెడ్డి. బాదం వెంకటేశ్వర రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ మేడగం పుల్లా రెడ్డి, అధికారులు మున్సిపల్ కమీషనర్ మహేష్ . హౌసింగ్ ఎఈ షకీర్, విద్యుత్ ఎఈ ప్రసాద్, సచివాలయ
సిబ్బంది పాల్గొన్నారు.
