సంక్షేమ రథ సారధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రానికి, ప్రజలకు బంగారు భవిష్యత్ అని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. దర్శి పట్టణంలోని రెండవ వార్డు (కొత్తపాలెం)లో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నివాసానికి వెళ్లి లబ్ధిదారులకు వారు పొందుతున్న లబ్ధి పత్రాలను అందించారు. ప్రతి ఒక్క కుటుంబం కూడ తమకు నేరుగా లబ్ధి చేకూరుతుందని సంతోషం వ్యక్తం చేసారు. మంగళ హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెన్నపూస వెంకట రెడ్డి, ఎంపీపీ జీఎస్ అచ్చారావు, వైఎస్ ఎంపీపీలు సోము దుర్గా రెడ్డి, ఎం.ఎన్.పి నాగార్జున రెడ్డి, కౌల్సిలర్లు వీసీ రెడ్డి, మేడగం మోహన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ వేమి రెడ్డి చెన్నా రెడ్డి స్థానిక నాయకులు వెన్నపూస చెన్నా రెడ్డి, ఎదురు శ్రీనివాస రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


