తాళ్లూరు మండలంలో దీర్ఘకాలికంగా సీఎఫ్ఎంఎస్ నిధుల వినియోగ నిర్వహణలో తలెత్తిన సాంకేతిక సమస్యలను ఎంపీడీఓ వై శ్రీనివాసరావు పరిష్కరించారు. మండలంలోని ఆరు పంచాయితీలకు చెందిన సర్పంచిల వేలిముద్రలు సీఎంఎంఎస్ అనుసంధానం కాక ఆరునెలలుగా నిధుల చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. మండలంలోని తాళ్లూరు, తూర్పు గంగవరం, మల్కాపురం, మాధవరం, దోసకాయలపాడు, శివరామపురం సర్పంచిల వేలి ముద్రలు సీఎఫ్ఎంఎస్ కు అనుసంధానం కాలేదు. దీంతో ఆయా పంచాయితీల యందు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా వేలి ముద్రలు అనుసంధానం కాక పోవటంతో ఏ పనులు చేయ్యాలన్నా బిల్లులు చెల్లింపు కష్టతరంగా మారింది. ఐదు నెలలుగా ఈ సమస్య ఆయా పంచాయితీల నిర్వహణకు కష్టంగా మారింది. ఐదు నెలలుగా ఈ సమస్యతో ఆయా పంచాయితీల నిర్వహణ కష్టంగా ఉన్నా ఉన్నది. ఇటీవల ఇన్చార్జిగా వచ్చిన ఎంపీడీఓ వై. శ్రీనివాసరావు ఆ సమస్య పరిష్కారంపై దృష్టి సారించారు. ఆయా పంచాయితీ సర్పంచ్ లు వేలిముద్రలు విజయవాడ కార్యాలయంలో సీఎఫ్ఎంఎస్ అనుసంధానం చేయించారు. దీంతో దీర్ఘకాలిక సమస్య పరిష్కరించినట్లయినది.
తాళ్లూరు మండలంలో దీర్ఘకాలిక సీఎఫ్ఎంఎస్ సమస్యను పరిష్కరించిన ఎంపీడీఓ వై శ్రీనివాసరావు
31
May